శ్రీ ద్రౌపతి అమ్మవారి ఆలయంలో మహాభారతం – మోగరాల

Garuda Tv
1 Min Read

గరుడ టీవీ ప్రతినిధి (తలారి లోకేశ్వర్ రాయల్) : ఒక స్త్రీని చర పట్టినందుకు లంక దహనం జరిగింది. అత్యంత జ్ఞాని బలవంతుడు అయినా పది తలలు కలిగిన రావణాసురుని వధ జరిగింది. అది రామాయణం.. అలాగే ఒక స్త్రీని మయసభలో కించపరిచినందుకు మహాభారత సంగ్రామం జరిగింది. ఒక స్త్రీని సభలో వివస్త్రను చేసి అవమానించాలని ప్రయత్నించిన వారికి, అది చూసినవారికి, చూసి వారించకుండా ఉన్నవారికి, ఇలా ప్రతి ఒక్కరికి శిక్ష పడింది. ఇది మహాభారతం.. ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా, పాకాల మండలం, మొగరాల గ్రామపంచాయతీ నందు సాక్షాత్తు ఆదిపరాశక్తి అంశ అయినటువంటి శ్రీ ద్రౌపతి దేవి అమ్మవారి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, కీర్తిశేషులు ఎం. రఘునాధ రెడ్డి, కీర్తిశేషురాలు ఎం. సంపూర్ణమ్మ గారి ఆశీస్సులతో… 49వ మహాభారత యజ్ఞం జరుగుచున్నది. మే నెల 29వ తేదీ నుండి జూన్ నెల 15వ తేదీ వరకు పగటిపూట హరికథ, రాత్రిపూట నాటకం జరుగును. పగటిపూట హరికథ శ్రీమతి ఉషారాణి భాగవతరణి తిరుపతి వాస్తవ్యురాలు చే నిర్వహించబడును.. అదేవిధంగా రాత్రిపూట నాటకం శ్రీ వెంకటేశ్వర కళా నాట్యమండలి, సుకుమార్ తిరుపతి వారిచే ప్రదర్శించబడును.. ఈ యొక్క మహా యజ్ఞానికి పాత్రులు కాగలరని మొగరాల గ్రామపంచాయతీ, మరియు తోట తిమ్మయ్య గారి పల్లి పంచాయతీ ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, మరియు భక్తాదులందరూ కోరుకుంటున్నారు.. శుభం..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *