పార్వతీపురం నియోజకవర్గంలో పొలిటికల్ వార్

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
4 Min Read

మాజీ ఎమ్మెల్యే యాక్షన్ :   

టిడిపి ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర అవినీతి, అక్రమాలు  తీరు పై మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఫైర్ అయ్యారు. సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రెవిన్యూ రికార్డ్ లు టెంపర్ చేయమని ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర ఎంఆర్ఓ ను గత మూడు నెలలుగా వేధిస్తున్నారు అని అన్నారు . ట్రాంపరింగ్ చేయలేదు అనే మూలగ గ్రామంలో డిజిటల్ సిగ్నేచర్ కోసం 2 లక్షల రూపాయలు లంచం తీసుకుని కూడా పని చేయడం లేదు అని దాని కోసమే వాట్సప్ కాల్ చేశాను అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా లో చరిత్ర లో మొదటి సారిగా ఒక ఎమ్మార్వో  ఎమ్మెల్యే మీద కంప్లీట్ పెట్టడం సిగ్గు చేటు అన్నారు. టిడిపి వేధింపులు తట్టుకోలేకే ఎంఆర్ఓ జయలక్ష్మి మూడు నెలల క్రితం సెలవు పెట్టారు. బడిదేవ కొండ మైనింగ్ విషయం లో అక్కడి ప్రజలు గ్రామదేవత వుంది అని అభ్యంతరాలు చెప్పినా మైనింగ్ కి సిఫార్సు చేశారు.  రేషన్ డీలర్, అంగన్వాడీ ఉద్యోగాలు అమ్ముకున్నారని టిడిపి ఎమ్మెల్యే పై పత్రికల్లో వార్తలు వచ్చాయి.  టిడిపి ప్రభుత్వ హయాంలో సెటిల్మెంట్ లు, దందాలు, ఆక్రమణలు ఎక్కువ అయ్యాయి.  డబ్బులు తీసుకొని మున్సిపల్ ఉద్యోగులను బదిలీ పై నియమించారు. ముగ్గురు మహిళలు టిడిపి ఎమ్మెల్యే విజయచంద్ర పై పోలీస్ కేసు లు వేసిన మాట వాస్తవమా కాదా.  గోశాల నిర్మాణాల్లో కూడా కప్పం పట్టించుకున్నారు. ఉపాధి హామీ పనుల్లో కూడా లంచం డిమాండ్ చేస్తున్నారు. లంచాలు తీసుకోపోతే ఇప్పుడు వాడుతున్న ఫార్చ్యూనర్ కార్, XUV700 కార్ గానీ, విజయనగరం లో ఉన్న అపార్ట్మెంట్ గానీ ఎలా వచ్చాయి అని అన్నారు.

ఎమ్మెల్యే విజయ చంద్ర రియాక్షన్ :

మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అవినీతి అనకొండ అని అలాంటి అవినీతిపరుడు నిజాయితీగా రాజకీయం చేస్తున్న తనపై తప్పుడు ప్రచారాలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని పార్వతిపురం ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర ఎద్దేవా చేశారు. మంగళవారం తన టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అలజంగి జోగారావు ఆధార రహితంగా తనపై తప్పుడు విమర్శలు చేశారని దమ్ము ధైర్యం ఉంటే వాటిని రుజువు చేయాలని సవాల్ విసిరారు. బదిలీలకు డబ్బులు తీసుకుంటున్నట్లు ఆరోపించిన జోగారావు ఆధారాలు ఉంటే చూపాలని డిమాండ్ చేశారు. రెవిన్యూ రికార్డులు టాంపరింగ్ చేయమన్నట్లు తహసీల్దారుపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆరోపిస్తున్న మాజీ ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు రెవెన్యూ అధికారులపై చేస్తున్న ఫిర్యాదులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అవినీతి అధికారులను బదిలీ చేయించడం తప్పా అని ప్రశ్నించారు. గతంలో రెవెన్యూ అధికారులను బ్లాక్ మెయిల్ చేసి వందలాది పట్టాలు దోచుకున్న జోగారావుకు నిజాయితీపరులు అవినీతిపరులు గానే కనిపిస్తారని ఎద్దేవా చేశారు. చెట్టుకు చీర కట్టినా చొంగ కార్చే అలజంగికి అందరూ వ్యభిచారులు గానే కనిపిస్తారని మండిపడ్డారు. రాత్రి అయితే పరాయి మహిళ పక్కన లేకుంటే ఆయనకు పూట గడవదని దుయ్యబట్టారు. బండి దేవరకొండ మైనింగ్ విషయంపైనా తప్పుడు విమర్శలు చేస్తున్నారని, ఆరోపణలను రుజువు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. వరద బాధితుల సహాయ నిధిని ముఖ్యమంత్రికి అందించలేదన్న ఆరోపణలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు దీనికి సంబంధించిన రసీదులను మీడియా ఎదుట ప్రదర్శించారు వైసిపి చెందిన ఒక వ్యక్తి 10 వేల చెక్కును ఇచ్చారని అది చెల్లకపోవడంతో వెనక్కి ఇచ్చేసామని గుర్తు చేశారు చంద్రబాబును విమర్శించిన వ్యక్తి నుండి డబ్బులు ఎలా తీసుకుంటామని ఆయన ప్రశ్నించారు 2009 ఎన్నికల్లో కేవలం 32 లక్షల ఆస్తిపాస్తులు మాత్రమే ఉన్నాయని అఫిడవిట్ ఇచ్చిన జోగారావు ఇప్పుడు 300 కోట్లకు పైగా ఆస్తులు ఎలా కూడ పెట్టారని నిలదీశారు. ఇటీవల రెండు కోట్లకు పైగా ఆదాయ పన్ను చెల్లించారని వివరించారు. ఆయన తనపై చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని అయితే జోగారావు చేసిన భూకబ్జాలకు అక్రమాలకు పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని వెల్లడించారు. గతంలో బొత్స కుటుంబం కాళ్లు పిసికిన జోగారావు ఇప్పుడు చిన్న శ్రీను కాళ్లు పిసుకుతున్నారని ఆక్షేపించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాను అడ్డగోలుగా దోచుకున్న చిన్న శ్రీను, బొత్స కుటుంబాన్ని తెగ పొగిడేస్తున్న జోగారావు, అవినీతి దందా అక్రమాల సామ్రాజ్యం ప్రజలందరికీ తెలుసునని తెలియజేశారు. ఇకపై జోగారావు కబ్జాకాండను మరింతగా వెలికి తీస్తానని ఎమ్మెల్యే విజయ చంద్ర తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *