తిరుపతి జిల్లా, తిరుచానూరు గరుడ న్యూస్ (ప్రతినిధి): హరికృష్ణ: తిరుచానూరు తిరుచానూరు ముళ్లపూడి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ముళ్ళపూడి సర్పంచ్ సూరి తెలిపారు మంగళవారము బుధవారం జరిగే జాతరను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సిబ్బంది ముళ్లపూడి ప్రజలు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ముళ్ళపూడి సర్పంచ్ సూరి పిలుపునిచ్చారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా భక్తులకు అమ్మవారి దర్శనము కల్పిస్తున్నట్లు తెలిపారు అలాగే అమ్మవారికి మంగళవారం మధ్యాహ్నం ముళ్ళపూడి ప్రజలు పొంగళ్ళు పెట్టి 5000 మంది దర్శనం చేసుకున్నారని ఆయన తెలియజేశారు ముళ్ళపూడి వాసులందరూ బుధవారం జాతర రోజున అమ్మవారిని దర్శించి ఆమె ఆశీస్సులు పొందాలని సకాలంలో వర్షాలు పడి రైతులు ముళ్లపూడి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గంగమ్మ అమ్మవారిని వేడుకుంటున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముళ్ళపూడి సర్పంచ్ సూరి వార్డ్ నెంబర్లు ఎంపీటీసీలు ముళ్లపూడి ప్రజలు తదితరులు పాల్గొన్నారు