తిరుపతి జిల్లా, పాకాల మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఎస్. రాజేష్: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు పాకాలలో డి టి గారికి వినతి పత్రం సమర్పించారు .ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.హేమలత మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు రైతుకు పెట్టు పెట్టుబడి సాయం 20,000 ఇస్తానని ప్రకటించి నేడు సంవత్సరం గడుస్తున్న దాని మూసే లేదు. ఈరోజు వ్యవసాయానికి పెట్టుబడి వ్యయం పెరిగిపోతున్నది పురుగుమందులు, ఎరువులు, విత్తనాలు , డీజిల్ ధర పెరగడంతో ఖర్చు విపరీతంగా పెరిగిపోతున్నది.ఈ పరిస్థితుల్లో రైతులు వ్యవసాయానికి దూరమయ్యే ప్రమాదం ఉంది .అందుకనే ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇస్తానని ప్రకటించియున్నారు. కానీ ఆచరణలో ఎండమావి గాని కనిపిస్తున్నది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతాంగం ను ఆదుకోవాలి. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతంలో మామిడి పంట విస్తారంగా ఉంది. దాని ధర లాటరీ పద్ధతిలోనే ఉంది పంట లేనప్పుడు దారం ఉంటుంది ధర ఉన్నప్పుడు పంట ఉండదు ఈ పరిస్థితుల్లో సంవత్సరమంతా ఎదురుచూసిన రైతుకు నిరాశ మిగులుతున్నది. కాబట్టి రైతుకు పెట్టుబడి సాయం 20,000 వెంటనే చెల్లించాలి. ఈ కార్యక్రమానికి రైతు సంఘం నాయకులు సుగుణ, ఆది కేశవుల్ రెడ్డి రైతులు పాల్గొన్నారు