గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని స్థానిక కమలా ఆంజనేయస్వామి ఆలయంలో నేడు హనుమ జయంతి నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ వారు తెలిపారు. నేడు ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి మూలవిరాట్కు విశేష అభిషేకం,ఎనిమిది గంటలకు మహా హారతి, సాయంకాలం ఆరు గంటలకు స్తంభమునకు ఆకాశ దీపారాధన, ఏడు గంటలకు గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జయంతి వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామి వారి కృప పాత్రులు కావాలని ఆలయ ప్రధాన అర్చకుడు తెలిపారు..



