గరుడ ప్రతినిధి పుంగనూరు

చౌడేపల్లి మండలం లోని చారాల గ్రామ పంచాయతీ చారాల యస్సి కాలనీ సమీపంలో గల బోర్ వెల్ రూము వద్ద ప్రమాదకర పరిస్థితిలో ట్రాన్స్ ఫార్మర్.గ్రామానికి కూత వేటు దూరంలోనే బోర్ వెల్ రూము ఉంది.అక్కడికి ప్రతిరోజు మంచినీరు వందలాది మంది వెళ్తుంటారు.ఐతే ఊరు కోసం ఏర్పాటు చేసిన సింగిల్ ఫేస్ ట్రాన్స్ ఫార్మర్,అలాగే బోరు కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్,రెండింటి చుట్టూ ముళ్ళచెట్లు,పెరిగాయి,తిప్పతీగ లు విద్యుత్ వైర్లకు తగలాయి. గరుడ న్యూస్ కథకం కావున సంబంధిత అధికారులు ముళ్ళు కంపలు,తిప్పతీగలు తీగలు పై అల్లుకోక మునుపే తొలగించాల్సిన అవసరం ఉంది.అంతే కాకుండా ఇదే ట్రాన్స్ ఫార్మర్ కు దాదాపు మూడు వందల మీటర్ల కేబుల్ వేశారు.కేబుల్ వైర్లుకూడా చేతికందే ఎత్తులో ఉన్నాయి అనే వార్త కు స్పందించిన విద్యుత్ అధికారులు బుధవారం కంపచెట్లను తొలగించారు. ఇప్పుడు చూడటానికి బహుముచ్చటగా ఉంది.కావున గ్రామస్తులు విద్యుత్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.



