
సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,మే22,(గరుడ న్యూస్):
మునుగోడు నియోజకవర్గం రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం బెల్ట్ షాపుల మూసివేతతో హర్షం వ్యక్తం చేస్తున్న మహిళలు సంస్థాన్ నారాయణపురం మండలం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నయీమ్ షరీఫ్ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పుకొచ్చరు.మునుపటి కాలంలో బెల్ట్ షాపుల నిర్వహణ వల్ల కూలి నాలీ చేసుకునే దినసరి కూలీలు తమ యొక్క రోజు సంపాదన బెల్ట్ షాపుల వద్ద మధ్యానికి బానిసలై డబ్బులను వృధా చేసుకునేవాళ్లు.తమ ఆరోగ్యాలను విషమయం చేసుకొని చనిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. నేడు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలతో స్వచ్ఛందంగా బెల్ట్ షాపులను మూసివేసిన నిర్వాహకులు ఈ నేపథ్యంలో మద్యానికి బానిసలు కాకుండా తమ జీవితాలలో వెలుగులు నింపడని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న చర్యలు ఉపకరించాయని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
