గరుడ ప్రతినిధి పుంగనూరు

చౌడేపల్లి మండలంలోని శెట్టిపేట వద్ద పిడుగు పడి కొబ్బరి చెట్టు ధ్వంసమై పెనుప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. శెట్టిపేట సమీపంలో డాబాల బ్యాంక్ రెడ్డప్ప కుటుంబ సభ్యులు ఉన్నారు. బోరు బావి వద్ద వర్షంలో ఉన్నారు. పక్కనే ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడి మంటలు చెలరేగాయి. కూత వేటు దూరంలో నివాసం ఉన్న ఇల్లు ఉంది. పిడుగు కొబ్బరి చెట్టు పైన పడింది కొబ్బరి చెట్టు ధ్వంసం అయింది. దీంతో చుట్టుపక్కల వారు ఊపిరి పీల్చుకున్నారు.


