మహాభారతం మహా యజ్ఞానికి నాంది – మొగరాల మహా భారతం..

Garuda Tv
1 Min Read

గరుడ న్యూస్ ప్రతినిధి : పాకాల మండలంలోని మొగరాల గ్రామం మహాభారతం మహా యజ్ఞానికి నాంది – మొగరాల మహా భారతం..

1)  మొదటిరోజు అమ్మవారు 23-05-2025 వ తేదీ నాడు ఉదయం 10 గంటలకు అమ్మవారి ఆలయం నుండి శ్రీ ద్రౌపతి దేవి అమ్మవారు పంచ పాండవుల సమేతంగా పోతురాజుల వారితో కలిసి ఊరేగింపుగా తిరిగే ప్రాంతాలు : తోట తిమ్మయ్యగారి పల్లె, వలపల వారి పల్లె, తోట పల్లె, ఎర్రే పల్లి, గెనుమగట్టు వారి పల్లె. అమ్మవారు ఈ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరి ఇంటికి విచ్చేయుచున్నారు. స్థానిక ప్రాంతాల మహిళలు ప్రతి ఒక్కరూ మీ ఇంటి వద్ద అమ్మవారికి మంగళ హారతులతో స్వాగతం పలికి అమ్మ కృప, కరుణ, కటాక్ష వీక్షణలకు పాత్రులు కాగలరని మనవి.

2) రెండవ రోజున అమ్మవారు: 24-05-2025 వ తేదీ నాడు తలారి వారి పల్లి, గొల్లపల్లి, తూర్పుపల్లి, గరిక నెట్టు, జంగాలపల్లి, జంగాలపల్లి బీసీ కాలనీ, జంగాలపల్లి దళితవాడ ప్రాంతాలలో అమ్మవారి ఊరేగింపు ఉంటుంది.

  • మూడవరోజున అమ్మవారు :
    25-05-2025 వ తేదీ నాడు కృష్ణాపురం, నేలదానిపల్లె, పచ్చిపాల పల్లె, గొల్లవాని వంక, కొత్త రామాపురం, పెద్ద హరిజనవాడ ప్రాంతాలలో అమ్మవారి ఊరేగింపు ఉంటుంది.
  • నాలుగవ రోజు అమ్మవారు:
    26-05-2025 వ తేదీ నాడు చల్లా వారి పల్లి, సిద్దయ్య గారి ఇండ్లు, మొగరాల ప్రాంతాలలో అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కీర్తిశేషులు: ఎం. రఘునాథరెడ్డి గారు కీర్తిశేషురాలు ఎం. సంపూర్ణమ్మ గార్ల ఆశీస్సులతో.. ఆలయ ధర్మకర్తలు భుజస్కందాలపై మహాభారత మహా యజ్ఞం అనే ఈ మహత్తర కార్యక్రమాన్ని దృఢ సంకల్పంతో కంకణ బద్ధులై, భక్తి భావంతో ముందుండి నడిపిస్తున్నటువంటి ఈ మంచి తరుణంలో భక్తాదులు అందరూ కలిసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని గ్రామస్తులకు తెలియజేయడమైనది.
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *