
గరుడ ప్రతినిధి పుంగనూరు


తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ విద్యానికేతన్ విద్యాలయంలో కుల వివక్ష, కుల రక్కసి, అగ్రవర్ణ విద్యార్థుల రూపంలో తాండవం ఆడుతుంటే విద్యానికేతన్ విశ్వ విద్యాలయం అధినేత కళ్ళు మూసుకుపోయి దళిత విద్యార్ధి జేమ్స్ పైన జరిగిన కుల వివక్ష దాడిని గురించి కనీసం స్పందించని విద్యానికేతన్ అధినేత మోహనబాబు గ కూడా యస్వంత్ నాయుడు గారి కులానికి సంబందించిన వర్గమే కారణమా? నీ కళాశాలలో దళిత విద్యార్ధి జేమ్స్ పైన జరిగిన దాడి పైన స్పందించకపోవడానికి మోహనబాబుకు కులం అడ్డు వచ్చిందా? స్కాలర్షిప్ ఆధారంగా దళిత విద్యార్థులను నీ కాలశాలలో చేర్చుకుని కోటాను కోట్లు రియేంబర్సు్మెంట్ చేసుకుంటూ సంపాదించుకుంటూ… నీ కులవర్గంలో రౌడీ మూకలను తయారు చేసి దళితులపై కుల వివక్ష చూపించి, దాడులు చేసి,కొట్టి కిడ్నాప్ చేసి బందించి మూత్రం తాగించిన దృశ్యాలు కనిపించడం లేదా మోహన్ బాబు, మంచు విష్ణు వెంటనే దళిత విద్యార్ధి జేమ్స్ పైన జరిగిన దాడిని కండిస్తూ స్పందించకపోతే ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, విద్యార్ధి సంఘాలు నీ విద్యాలయాలను ముట్టడిస్తామని విద్యానికేతన్ అధినేత మోహన్బాబు, మంచు విష్ణులను హెచ్చరిస్తున్నామని, నీ కాలశాలలో విద్యార్థులను విద్యార్థులుగా మారుస్తున్నారా? రౌడీ మూకలుగా నీ జాతి రౌడీలను తయారు చేసుకుంటున్నారా? దళిత విద్యార్ధి అయిన జేమ్స్ పైన యస్వంత్ నాయుడు మరియు అతని అనుచర విద్యార్థులు కలిసి కొట్టి, కిడ్నాప్ చేసి తిరుచనూరు దగ్గర లాడ్జిలో బందించి, మూత్రం తాగించిన పోరంబోకు విద్యార్థులను నీ కళాశాలలో విద్యార్థులు కావడం మోహన్ బాబు… నీ కొడుకు మంచు విష్ణు సిగ్గు పడాలి, తక్షణమే యస్వంత్ నాయుడుని అతని రౌడీ మూకలపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం స్పందించి యస్వంత్ నాయుడుపైన హత్యా ఎత్నం, ఎస్సి, ఎస్టీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చిత్తూరుజిల్లా OBC విద్యార్ధి సంఘ అధ్యక్షులు వెంకట యాదవ్, పుంగనూరు నియోజకవర్గం సీనియర్ నాయకులు పాముల హరి డిమాండ్ చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు