గరుడ న్యూస్,సాలూరు
వ్యవసాయ రంగంలో నేటి గిరిజన మహిళలు విత్తనం వేసిన దగ్గర నుండి కోత కోసే వరకు ప్రతి దశలోనూ తమ పనితీరును కనబరుస్తూ అధిక దిగుబడులను సాధించడానికి కృషి చేస్తున్నారని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు జీలుగువలస గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిఆర్పి కొండేటి సురేష్ ఆధ్వర్యంలో జరిపిన రైతుల సమావేశంలో మాట్లాడుతూ గిరిజన మహిళలే ప్రకృతి సేద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అని ఈ ఖరీఫ్ సీజన్లో పెద్ద ఎత్తున ప్రకృతి సేద్యాన్ని విస్తరించాలంటే గిరిజన మహిళల సహకారం లేకుండా సాధ్యం కాదని తెలిపారు గిరిజన రైతులు గిరిజన సాంప్రదాయ పంటలైన చిరుధాన్యాల సాగును మరింతగా విస్తృతం చేయాలని ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుంది అని చిరుధాన్యాల విత్తనాలు 90 శాతం రాయితీపై అందిస్తున్నామని తెలిపారు. గట్లపై కంది కూరగాయలు వంటి వాటిని పండించుకోవాలని ఏక పంట కాకుండా అంతర పంటలు వేసుకోవాలని ఈ విషయమై మన ప్రక్కనే ఉన్న రెట్లపాడు గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవలసిన అవసరం ఉందని తెలిపారు. సర్పంచ్ ముఖి ఆనందరావు మాట్లాడుతూ కంది చిరుధాన్యాలు, వరి విత్తనాలు త్వరగా అందించాలని కోరారు. తంగలాం గ్రామ పెద్ద సారా రాజు గిరిజన భాషలో ప్రకృతి సేద్య ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహాన్ని అందించాలని కోరుతూ గ్రామ పెద్దలను సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రకృతి సేద్య ఐ సి ఆర్ పి లు చదల రాజు అప్పన్న గ్రామ వ్యవసాయ సహాయకులు కిరణ్ రైతులు పాల్గొన్నారు.




