గరుడ న్యూస్,సాలూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా నియమితులైన పాలకొండ నియోజకవర్గం జనసేన శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన కురుపాం నియోజకవర్గం జనసేన టీమ్ ఈ సందర్బంగా ఎమ్మెల్యేని దుస్సాలువ తో సన్మానించి కురుపాం నియోజకవర్గ సమస్యల పైన సుదీర్ఘమైన చర్చించడం జరిగింది ఎమ్మెల్యే జనసేన పార్టీకి బలోపేతానికి తగిన సూచనలు ఇస్తూ పార్టీకి గ్రామస్థాయిలో మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేయమని సూచనలు ఇవ్వడం జరిగింది. కూటమి నాయుకులుతో కలిసి నియోజకవర్గం అభివృద్ధి పర్చుకునేలా పని చెయ్యండి మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా మీ వెంట నేను ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గ నియోజకవర్గ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ గార గౌరీ శంకర్రావు, కొమరాడ మండల పార్టీ అధ్యక్షులు తెంటి శేఖర్, కొమరాడ మండల నాయకులు గణేష్, కొమరాడ మండల జనసైనికులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ పాల్గొన్నారు.




