
గోదావరి జిల్లా, మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): తణుకు. వరప్రసాద్: సమస్యల పరిష్కారానికై ప్రత్యేక శ్రద్ధ వహిస్తా: ఎమ్మెల్యే సత్యానందరావు. ప్రజల సమస్యలకు సరైన పరిష్కార వేదిక ప్రజాదర్బార్ అని, ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద సత్యానందరావు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలకు నేరుగా పరిష్కారం మార్గం చూపేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని తెలిపారు. నేడు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో 163 వినతులు వచ్చినట్లు తెలిపారు. సమస్యలను బట్టి వాటి పరిష్కార సమయం ఉంటుందని అన్నారు. ప్రజలు ఇచ్చిన సమస్యల వినతులు పరిష్కారం అయ్యే వరకు వాటిపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు.

