తిరుపతి జిల్లా, పాకాల మండలం గరుడ న్యూస్ (ప్రతినిధి): ఎస్. రాజేష్: పాకాల మండలం, గాదంకి పంచాయతీ, గుడివారిపల్లి చెందిన వైఎస్ఆర్ సీపీ నేత గిరి పెద్దనాన్న సిద్దయ్య ఆకస్మికంగా మృతి చెందారు. ఆ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి శుక్రవారం ఆ గ్రామానికి చేరుకుని సిద్ధయ్య భౌతిక కాయానికి పూల మాల వేసి అంజలి ఘటించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.






