గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం లోనిశెట్టి పేట గ్రామంలోటమోటా రైతు వీరభద్రయ్య తమకున్న పొలములో టమోటా పంటను పండించాడు టమాటా చెట్లు నాటినప్పటి నుండి వాటికి ఉపయోగించే మందులకు మరియు కాయలు కోసేటప్పుడు వేచించిన ఖర్చు కూడా రావడం లేదని ఆ రైతు లబోదిబోమంటున్నారు సరైన గిట్టుబాటు ధర లేక కోతకు వచ్చిన కాయలు పశువులకు, బర్రెలకు మేతగా ఉపయోగిస్తూ తక్కిన కాయలు రోడ్డు పాలు చేస్తున్నామని తమ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులను నట్టేట ముంచిందని ప్రస్తుత ప్రభుత్వం రైతే రాజన్నారు తీరా చూసేసరికి రైతుకు వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు వ్యవసాయం చేయడానికి అప్పులు చప్పులు చేసి, ఇంట్లో ఉన్న నాగ నర్ట్రా తాకట్టు పెట్టి వ్యవసాయానికి వెచ్చించిన నగదు చేతికందక చౌడేపల్లి మండలంలో రైతులు ఆత్మహత్య చేసుకునే సమయం ఆసందమై ఆసన్నమైందన్నారు ఇకనైనా సంబంధిత ప్రభుత్వం స్పందించి టమాటా రైతులుకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని ఆయన కోరారు


