గరుడ ప్రతినిధి పుంగనూరు

శక్తి క్షేత్రంమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు రాష్ట్రం తో పాటు కర్ణాటక తమిళనాడులో నుంచి అధిక సంఖ్యలో యాత్రికులు బోయకొండకు తరలివచ్చారు దీంతో బోయకొండ భక్త జనసంద్రమైంది కొండ దినాన్ని పురస్కరించుకొని ఆలయంలో అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారిని అభిషేకించి విశేష అలంకరణ భావించారు వివిధ పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు క్యూ లైన్ లలో అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం భక్తులకు మౌలిక వస్తువులను సమకూర్చారు ఆలయ అధికార సిబ్బంది అర్చకులు సేవలందించారు


