సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి, సంస్థాన్ నారాయణపురం,చిల్లాపురం,మే26,(గరుడ న్యూస్):
సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని చిల్లాపురం గ్రామంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.ఈ యొక్క చెక్కులు సూర యాదమ్మ,మెరుగు వెంకన్న,చక్రపాణి,మేకల లక్ష్మయ్య,లకు ఇవ్వనైనది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కుక్కల నరసింహ్మ,మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం,వారి అభివృద్ధి కొరకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పాలన సాగిస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,మెరుగు జంగయ్య,పర్సగోని నరసింహ్మ,గ్రామ శాఖ అధ్యక్షుడు లింగంపెల్లి రాజు,మేకల వెంకటయ్య,బండి యాదయ్య,లింగంపెల్లి రవి,జలంధర్,వెంకటేష్,మేకల చంద్రయ్య,తదితరులు,పాల్గొన్నారు.



