గరుడ ప్రతినిధి పుంగనూరు

జూన్ 1వ తేదీ నుండి మండలంలోని అన్ని గ్రామాల రేషన్ షాపులలో రేషన్ డీలర్లే రేషన్ సరుకులను పంపిణీ చేయుటకు సర్వం సిద్ధం చేసినట్లు తహాశిల్దారు హనుమంతు అన్నారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత విఆర్వోలు మరియు రేషన్ డీలర్లతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు . అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల భాస్కర్ రేషన్ వాహనాలను రద్దు చేస్తూ అలాగే ఎండీయు ఆపరేటర్లను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయటం అందరికీ తెలిసిందేనని, దీంతో ప్రభుత్వ నిర్ణయం మేరకు రేషన్ సరుకులను రేషన్ డీలర్లే పంపిణీ చేసేలా రేషన్ డీలర్లకు ప్రత్యేక ఆదేశాలను ఇచ్చామని,అలాగే రేషన్ షాపులలో ఉదయం 8 నుండి 2 గంటల దాకా, మరియు సాయంత్రం 4 గంటల నుండి 7గంటల దాకా నిత్యవసర రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుందని,ఈ సమయంలో వినియోగదారులు తమ రేషన్ సర్కులను పొందవచ్చునని అన్నారు.అలాగే రేషన్ షాపుల వద్ద రద్దీ లేకుండా వినియోగదారులు సామరస్యంగా సరుకులను తీసుకునేలా, మరియు స్టాక్ రిపోర్టును సూచించే పట్టికను, రేషన్ షాప్ వద్ద తాగునీటి వసతులు కల్పిస్తూ, గుంపులు గుంపులుగా కాకుండా ఒక క్రమ పద్ధతిలో, సరుకులను ఎక్కువ రేటుకు అమ్మకుండా జాగ్రత్తలు పాటిస్తూ తగు చర్యలు చేపట్టాలని సూచించారు.రేషన్ డీలర్ల నుండి ఏవైనా సమస్యలు ఉన్నట్లు ప్రజల నుండి ఫిర్యాదులు అందితే అట్టి వారిపై శాఖా పరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఇకపై రేషన్ డీలర్లే రేషన్ సరుకులు పంపిణీ చేస్తారని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు,డీలర్లు తదితరులు పాల్గొన్నారు.


