పులివర్తి వారి పల్లెలో.. పల్లె పడుచుల కోలాటం గజ్జ పూజ.. సహాయ సహకారాలు అందించిన పులివర్తి సుధారాణి..

Sesha Ratnam
2 Min Read

తిరుపతి జిల్లా, గరుడ న్యూస్ (ప్రతినిధి): తలారి లోకేశ్వర్ రాయల్: కోలాటం భజనలకు పుట్టినిల్లు పల్లెలు.. పల్లెటూరు అందాలు, పల్లెల్లో మనిషికి మనిషికి మధ్య ఉన్న ఆప్యాయతలు, కలుపుకోలుతనం, అంతా కలివిడిగా కలిసికట్టుగా ఉండే సాంప్రదాయం తరతరాలుగా వస్తున్నదే. అలాగే పల్లెటూర్లలో వివిధ కళలు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని సంతరించుకుంటూనే ఉంటాయి. అదే విధంగా కోలాటం భజనలకు మహిళలు పురుషులు కూడా మక్కువ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. గురువుల ఆధ్వర్యంలో వారి వారి గ్రామాల్లో కోలాటం భజనలు టీములు టీములుగా ఏర్పడి అందరికీ ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తూ, ఒక చక్కటి ఆరోగ్యకరమైన, సంతోషకరమైన వాతావరణంలో ఈ కోలాటం భజనలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూనే ఉంటారు. అదేవిధంగా తిరుపతి జిల్లా లో పులివర్తి వారి పల్లె అంటే తెలియని వారు ఎవరూ లేరు. ప్రస్తుత చంద్రగిరి టిడిపి పార్టీ ఎమ్మెల్యే పులివర్తి నాని గారి స్వగ్రామం పులివర్తి వారి పల్లె. పులివర్తి నాని గారి సతీమణి పులివర్తి సుధారాణి అక్కడి మహిళలందరికీ ఒక ఆదర్శప్రాయురాలు. ప్రతి ఒక్కరిని తన వారిగా ఆదరిస్తూ తన వంతు సాయం చేస్తూ స్త్రీలు వంటింటి కుందేలుగా ఉండిపోకూడదు అంటూ, తనకు తోచిన సహాయం చేస్తూ ముందుకు నడిపించే మహిళ మూర్తి పులివర్తి సుధారాణి. అలాగే ఈ కార్యక్రమంలో అత్యంత ప్రముఖులు, అత్యంత ముఖ్యమైన వారు అయినటువంటి వారు గురువులు. వీరి గురించి వర్ణించడానికి పదాలు సరిపోవు, రాయడానికి పేజీలు సరిపోవు. కారణం తమ శిష్యులకు ఒక సాంప్రదాయక బద్ధమైన చక్కటి కోలాటం భజనలు నేర్పి స్తూ వారికి ఎన్నెన్నో దైవ కార్యక్రమాల్లో పాలుపంచుకునే విధంగా వారిని తయారు చేసే విధానం ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడే విషయం. ఒక గురువుగారు కోలాటం భజన నేర్పించి, శిష్యులకు గజ్జెపూజలు నిర్వహించే సమయంలో, మిగతా గురువులందరూ వారి శిష్య బృందాలతోనూ, తమకు తెలిసిన వారితోనూ అక్కడికి వచ్చి తమ తమ టీం లతో చక్కని నృత్యాలు చేయించి వారికి మరింత ఉత్సాహాన్నిచ్చి, వారిలో ఆసక్తిని పెంచుతారు. అదేవిధంగా పులివర్తి వారి పల్లెలో రమేష్ గురువుగారి శిష్య బృందం కోలాటం భజన గజ్జె పూజ నిర్వహిస్తున్న సమయంలో మిగతా గురువులు వారి శిష్యులతోను, మిగిలిన బృందాలతోను కలిసి వచ్చి అక్కడ చక్కటి నృత్యాలు చేస్తూ అందరిని ఉత్సాహపరిచారు. చక్కని పాటలు ఆలపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. వారికి రమేష్ గురువుగారు తన శిష్య బృందాలతో కలిసి శాలువాలు కప్పి,  చిరు సన్మానాలు చేశారు. ఈనాటి ఈ కార్యక్రమాన్ని గరుడ టీవీలో లైవ్ గా ఇవ్వడం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము.. శుభం

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *