సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మే 27,(గరుడ న్యూస్):
తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజెఫ్) రజతోత్సవ సంబురాల పోస్టర్ ను ఇవాళ టిఆర్ఎస్,వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి హైదరాబాద్ లో ఆవిష్కరించారు.
తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకపాత్ర పోషించిన టిజేఎఫ్.. 25 వసంతాల సంబురాలు జరుపుకోవడం ఎంతో గర్వకారణమని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు.దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల విముక్తి కోసం కేసీఆర్ సారథ్యంలో సాగిన మలి దశ ఉద్యమంలో ప్రజలను చైతన్య పరచడంలో తెలంగాణ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని కేటీఆర్ గుర్తుచేశారు.తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమానికి బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఎన్నో రకాల కార్యక్రమాలు అమలు చేశామని,టీజేఎఫ్ కి తాము ఎప్పటికీ అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.31న జలవిహార్ లో నిర్వహిస్తున్న రజతోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఈ సందర్భంగా అల్లం నారాయణ కోరారు.ఈ పోస్టర్ ఆవిష్కరణలో మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణతో పాటు,టియుడబ్ల్యూ జే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్,ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్,మాజీమంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,సునీత లక్ష్మరెడ్డి,కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమా,ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్,టీయూ డబ్ల్యూజే కోశాధికారి పి.యోగానంద్,టీయూ డబ్ల్యూజే హైదరాబాద్ నగర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శిలు రాకేష్ రెడ్డి,సోమేశ్,కోశాధికారి బాపు రావు,చిక్కులు శ్రీనివాస్,ప్రవీణ్,సతీష్,దిలీప్,రవి కుమార్,తదితరులు,పాల్గొన్నారు.



