
గరుడ ప్రతినిధి పుంగనూరు

చిత్తూరు జిల్లా. పుంగనూరు పట్టణంలో ఏఐటియుసి. పట్టణ కార్యదర్శి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని నిరసన నిర్వహించారు ఏఐటియుసి పట్టణ కార్యదర్శి వెంకటరమణారెడ్డి. సిపిఐ పట్టణ కార్యదర్శి. రామ్మూర్తి మాట్లాడుతూ ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటిస్తున్న సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కాకుండా పరీక్షించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒత్తిడి తేవాలని కోరారు. ఉక్కు కర్మాగారంలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లో తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు మున్నా తదితరులు పాల్గొన్నారు.