
తహసిల్దార్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు
గరుడ ప్రతినిధి
చౌడేపల్లి మే 28
స్థానిక మండల పరిపాలన భవనంలోని తాసిల్దార్ కార్యాలయంలో దివంగత నేత ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మండల తహసిల్దార్ హనుమంతు ఆధ్వర్యంలో కార్యాలయం నందు ఎన్టీఆర్ చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు
