
గరుడ ప్రతినిధి పుంగనూరు


పుంగనూరు నియోజకవర్గంలోని సోమల మండలం ఆవులపల్లి అటవీ ప్రాంతంలో సుమారు 14 ఏనుగుల గుంపు గత నాలుగు రోజుల నుండి అర్ధరాత్రి వేళ సంచరిస్తున్నాయని మా పంట పొలాల వైపు వచ్చి పంటలను మరియు అక్కడ ఉన్న బోరు మోటర్ అమర్చిన డ్రిప్ పరికరాలు,పివిసి పైపులు, టమోటా, వంక, బీర,బెండ, బీన్స్, మిరప వంటి పంటలను తొక్కి వేసి ధ్వంసం చేస్తున్నాయి మామిడికాయలు కిందకి రాలిపోతున్నాయి రైతు చేతికి వచ్చే పంటలను పూర్తిగా నాశనం చేస్తున్నాయి మామిడి తోటకు కాపలా ఉన్న రైతులు పైకి ఏనుగులు దూసుకొస్తున్నాయి బీకర, గంభీరమైన శబ్దాలతో అటవీ ప్రాంతం అడలిపోతున్నది రైతులు తమ వ్యవసాయ పొలముల నుండి ఇంటి వైపు పరుగులు తీస్తున్నారు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న సమయంలో ఏనుగులు వల్ల పూర్తిగా నష్టపోతున్నామని ఇంట్లో ఉన్న నగ,నట్రా మార్వాడి సెట్లు వద్ద తాకట్టు పెట్టి తీసుకువచ్చిన నగదు పంటపై వెచ్చిస్తే పంటతీ చేతికి వచ్చే సమయంలో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల ఆత్మహత్య వైపు మొగ్గుచూపుతున్నా మన్నారు ఇకనైనా సంబంధిత రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, మండల స్థాయి అధికారులు స్పందించి ఏనుగులను అదుపులోకి తీసుకొని, పంట నష్టం పొందిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.