గరుడ ప్రతినిధి పుంగనూరు
చౌడేపల్లి మండలం లో మహానేతకు నివాళ్ళు అర్పించిన తెలుగుదేశం పార్టీ, పార్టీ వ్యవస్థాపకుడు దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు సినీ, రాజకీయ రంగాలలో విశ్వవిఖ్యాతుడు, పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి తెలుగు ప్రజల గుండె చప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్బంగా చౌడేపల్లి బస్టాండ్ నందు ఆ మహనీయునికి పూలమాలవేసి నివాళ్ళు అర్పించిన చౌడేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి (చిట్టి).ఈ సందర్బంగా రమేష్ రెడ్డి మాట్లాడుతు నందమూరి తారక రామారావు మన మధ్య లేకపోయిన మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచి వున్నారని ఆ మహనీయుని సేవలు భవిష్యత్తు తరాలు సైతం మరచిపోరని ప్రతి పేదవాడి జీవితంలో వెలుగులు నింపిన మహనుభావుడని కొనియాడారు అనంతరం నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. మరోకసారి నందమూరి తారక రామారావు ని స్మరించుకుంటూ నివాళ్ళు అర్పించారు.ఈ కార్యక్రమములో మండల నాయకులు బోయకొండ సుబ్బు, పవన్ కార్యకర్తలు అన్నగారి అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.