విశాఖపట్నం రేంజ్ పరిధిలోని జిల్లాల ఎస్పీల తో డీఐజీ వీడియో కాన్ఫరెన్స్

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
2 Min Read

విశాఖపట్నం రేంజ్ పరిధిలోని జిల్లాల ఎస్పీలు మరియు ఇతర పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వార(వర్చ్వల్ విధానంలో) సమీక్ష సమావేశం నిర్వహించిన విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్

విశాఖపట్నం రేంజ్ డీఐజీ వీడియో కాన్ఫరెన్స్ ద్వార(వర్చ్వల్ విధానంలో) నిర్వహించిన సమీక్ష సమావేశం పాల్గొన్న పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ  ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపిఎస్

గంజాయి కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న నిందితులను త్వరిగతిన అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలి ….

విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ రేంజ్ పరిధిలోని జిల్లాల ఎస్పీలు మరియు ఇతర పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వార(వర్చ్వల్ విధానంలో) సమీక్ష సమావేశంను బుధవారం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో వర్చువల్ విధానంలో పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపిఎస్ తో పాటుగా పాలకొండ డిఎస్పీ రాంబాబు, డిసిఆర్బి సిఐ ఆదాం  పాల్గొన్నారు.

- Advertisement -
Ad image

ఈ సమీక్ష సమావేశంలో గంజాయి అక్రమ రవాణా, వినియోగాన్ని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నిందితుల అరెస్టు, నేరాలు పునరావృతం చేసే వారిపై ఆస్తుల జప్తు, పెండింగ్ నాన్ బెయలబుల్ వారెంట్స్ మరియు డీ-అడిక్షన్ కార్యక్రమాలపై రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి, ఐపీఎస్  జిల్లా అధికారులతో సమగ్రంగా చర్చించారు.

గంజాయి కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, అదేవిధంగా గంజాయి కేసులో ఉన్న వారిపై ఎన్.బి.డబ్ల్యూ (NBW) లను ఎగ్జిక్యూట్ చేయాలని ఆదేశించారు. నాన్ బెయలబుల్ వారెంట్స్(NBW) అములు చేయుట కొరకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయాలని, వారికీ అమలు చేసేవిధానం,ఇతర రాష్ట్రాల లోని వ్యక్తుల మీద గంజాయి కేసుల లలో పెండింగ్లో ఉన్న NBW అమలు వంటి వాటిపై ప్రత్యేఖ కార్యచరణ ద్వార అములుచేసే విధివిధానాలపై చర్చించారు. తరుచూ అలవాటు పడి గంజాయి రవాణా,వినియోగం నేరాలు పునరావృతం చేసే వారిపై ప్రత్యేఖ ద్రుష్టి సారించాలని, గంజాయి కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న నిందితులను త్వరిగతిన అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని, కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, తక్షణమే చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని సూచించారు.

గంజాయి అక్రమ రవాణాలో లబ్ధిదారులుగా ఉన్న వ్యక్తుల ఆస్తులను గుర్తించి త్వరితగతిన జప్తు చేయాలని ఆదేశించారు. ఈ కేసుల్లో ఉన్న నిందితులను తక్షణమే గుర్తించి డిటెయిన్ చేయాలని సూచించారు.

గంజాయి వినియోగదారులను గుర్తించి, వారికి కౌన్సెలింగ్ చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రజల సహకారంతో సమగ్ర సమాచారం సేకరించాలని తెలిపారు.

ఇప్పటికే ఉన్న చెక్ పోస్టులలో మరియు కొత్త చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిరంతరం చేపట్టాలన్నారు. సీసీటీవీలు, డ్రోన్ల ద్వారా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి గంజాయి సాగు, అక్రమ రవాణా అడ్డుకట్ట వేస్తూ త్వరితగతిన కేసులను ఛేదిస్తూ పురోభివృద్ది సాదించాలని అధికారులకు సూచించారు.

- Advertisement -
Ad image

విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపీఎస్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వార ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపిఎస్ గారు, పాలకొండ డిఎస్పీ రాంబాబు, డిసిఆర్బి సిఐ ఆదాం, మరియు ఇతర జిల్లాల పోలీసు ఉన్నతాదికారులు అధికారులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *