పుంగనూరు నియోజకవర్గం
చౌడేపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగియనుండడానికి దగ్గర పడుతుండడంతో యువకులు ఉద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో బోయకొండ గంగమ్మ దర్శనార్థం తరలివచ్చారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి జంతుబలులు సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఏకాంబరం పర్యవేక్షణలో భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎస్సై నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.



