
కడప నగరానికి సమీపం సికే దిన్నె లో జరుగుతున్న తెలుగు దేశం పార్టీ కార్యకర్తల పండుగకు మహానాడుకు మండలం నుంచి తెలుగు తమ్ముళ్లు తరలి వెళ్లారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి (చిట్టి) ఆధ్వర్యంలో ప్రతి పంచాయతీ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు దీంతో చౌడేపల్లి పసుపుమయం అయింది ఉదయాన్నే మండలంలోని అన్ని పంచాయతీల నుంచి వాహనాల ద్వారా చౌడేపల్లికి చేరుకొని భారీ ర్యాలీ నిర్వహించి తర్వాత సికే దిన్నెలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో పవన్, రమణ, అర్జున్, పరమేష్, గిరి నాయుడు, బోయకొండ సుబ్బు, ప్రభాకర, విజయ్, మరియు మండలములో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు


