
గరుడ న్యూస్,సాలూరు
దేశం లో సుమారు 1.5 కోట్ల మంది రైతులతో ప్రత్యక్ష సంభాషణలో భాగంగా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వికసిత కృషి సంకల్ప అభియాన్ స్థానిక సాలూరు మండలం మామిడిపల్లి, తోణాం, కురుకుట్టి గ్రామాలలో కృషి విజ్ఞాన కేంద్రం రస్త కుంటుబాయి వారి ఆధ్వర్యంలో మొదలైంది మే 29 మొదలు జూన్ 12 వరకు ఈ కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లాలో జరుగుతుంది. పాడి -పంట ప్రభుత్వ పథకాలను గురించి తెలియజేయడంతో పాటు గ్రామస్థాయి రైతాంగం విజయ గాథలు, రైతు సమస్యలకు సాంకేతిక పరిజ్ఞానం తెలియజేయడం ఈ అభియాన్ ముఖ్య ఉద్దేశం.అదే విధంగా రైతాంగం యొక్క అభిప్రాయాలు సేకరణ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె. తేజేశ్వర రావు మాట్లాడుతూ బ్లాక్ బెంగాల్ మేకలు గురించి నేపియర్ గడ్డి గురించి అలానే ప్రకృతి వ్యవసాయం గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి నుండి శాస్త్రవేత్త డాక్టర్ విశ్వనాథ రెడ్డి, పార్వతీపురం జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ బి. శారద, కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ జి. అమృతవీణ , సాలూరు ఏఈఓ శ్రీనివాసరావు విఏఏ సంధ్య ప్రకృతి వ్యవసాయ ఐ సి ఆర్ పి లు రైతులు మహిళలు యువత పాల్గొన్నారు…

