గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో జూన్ 3న ఉదయం 10:30 గంటలకు సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో లీలామాధవి శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిధిగా ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో వివిధ అభివృద్ధి పనుల విషయమై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అన్నిశాఖల అధికారులు,ప్రజాప్రతినిదులు పాల్గొనాలని ఆమె కోరారు..



