గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు తహశీల్దార్ కార్యాలయంలో SC, ST విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం MRO రాము ఆధ్వర్యంలో జరిగింది. ‘పట్టణంలోని ప్రభుత్వ భూములు, చెరువులు దురాక్రమణకు గురవుతున్నయని పదే పదే అధికారులకు విన్నవించిన చర్యలు మాత్రం శూన్యం. ఎందుకు ఇంత నిర్లక్ష్యం. ఇప్పటికైనా స్పందించి చెరువులను కాపాడాలి’ అని NR అశోక్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



