గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గంలో చౌడేపల్లి మండలంలోని పుదీపట్టల్లో వెలిసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అర్చకురాలు శ్రావణి అమ్మవారికి, అభయాంజనేయ స్వామికి,నాగభైరవ స్వామికి, పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పుంగనూరు. మదనపల్లి.చౌడేపల్లి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఉభయ దారులు బాలాజీ రావు అనసూయమ్మలు ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ ప్రసాదాలు భక్తులకు అందజేశారు


