గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం లోని గడ్డంవారిపల్లి పంచాయతీ లో బతలాపురం గ్రామానికి చెందిన సతీష్.కడప నందు నిర్వహించిన మహానాడుకు వెళ్ళారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో కందూరు మరియు సోమల మార్గ మధ్యలో అశ్వస్థతకు గురై గుండె పోటు కారణంగా మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న చౌడేపల్లి మండల అద్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి (చిట్టి) బత్తలాపురం గ్రామానికి చేరుకుని సతీష్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళ్ళు అర్పిం చారు.అనంతరం వారి కుటుంబాన్ని పరమర్శింఛి వారికి అన్ని విధాల తెలుగుదేశం పార్టి అండగా వుంటుందని భరోసా ఇచ్చారు.అదే గ్రామానికీ చెందిన కీర్తిశేషులు స్వర్గీయ గువ్వల రామకృష్ణ రెడ్డికి అత్యంత సన్నిహితులు అడవి గుర్రప్ప మరణించడం జరిగింది,వారి పార్థీవ దేహానికి పూల మాల వేసి నివాళ్ళు అర్పించారు.
ఈ కార్యక్రమములో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చౌడేపల్లి మండలం, గడ్డంవారిపల్లి పంచాయతీ, బత్తలాపురం గ్రామనికి చెందిన సతీష్ గారు మృతిచెందిన విషయం తెలుసుకున్న పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి దహన క్రియలకు 10000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాన్ని ఫోన్‌లో పరమర్షించడం జరిగింది..





