


మహా యజ్ఞంలా కొనసాగుతున్న మొగరాల మహాభారతం హరికథ గానంలో భీష్మ ప్రతిజ్ఞ నేడు పూర్తి అయినది. మహాభారత కాలంలో జరిగినటువంటి ఈ కథా కథనాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నటువంటి శ్రీమతి ఉషారాణి భాగవతరణి పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ అమ్మవారు ఆశీర్వాద ఫలితమో లేదు అంటే ఆలయ ధర్మకర్తల దృఢ సంకల్పం కారణం చేతనో తెలియదు గానీ రోజురోజుకీ భక్తుల రద్దీ పెరుగుతున్నది. వేసవి సెలవులు కారణంగా అమ్మమ్మ గారి ఇళ్లకు వచ్చిన పిల్లల దగ్గర నుండి వృద్ధాప్యంలో ఉన్న ముదుసలి వారి వరకు అందరూ వచ్చి భాగవత మహాకావ్యాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షిస్తుండడం, వినడం చాలా గొప్ప విషయంగా భావించవచ్చు. నిన్నటి రోజు వేద వ్యాస మహర్షి జననం గూర్చి అద్భుతంగా వివరించిన హరికథా గానంతో మొదలు పెట్టి నేడు భీష్మ ప్రతిజ్ఞతో ప్రతి ఒక్కరిలో ఆసక్తిని మరింత రెట్టింపు చేసే విధంగా కథను, ఒక అద్భుత కావ్యాన్ని చక్కటి పద్ధతిలో వివరిస్తున్నటువంటి భాగవతరణ శ్రీమతి ఉషారాణి గారికి అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇంతటి మహత్తర కార్యక్రమానికి సంకనబద్ధులై నిర్విరామంగా 49 సంవత్సరాలుగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలను, భక్తులను మరింత భగవంతునికి చేరువ చేస్తున్నటువంటి న
మొగరాల ద్రౌపదీదేవి ఆలయ ధర్మకర్తల మండలి వారికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇంతటి మహత్ కావ్యాన్ని గరుడ టీవీ ద్వారా పదిమందికి చూపించే భాగ్యాన్ని కలిగించినందుకు మేము ధన్యులం. రేపటి రోజు అనగా తేదీ 31-05-2025 న శనివారం నాడు మధ్యాహ్నం రెండు గంటలకు కర్ణుని జననం. కర్ణుడు కుంతీపుత్రుడు, సూర్య దేవుని ఆశీర్వాదంతో జన్మించినవాడు. సూత పుత్రుడు అయినప్పటికీ అతడు ఒక గొప్ప యోధుడిగా ధనుర్విద్యలో నిపుణుడిగా ఎదిగాడు. ఇంతటి పరాక్రమవంతుడైనప్పటికీ దుర్యోధనుడికి అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు. కారణంగా ధర్మపక్షాన్ని విడిచిపెట్టి కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. కర్ణుడు తన దానగుణం, విశ్వాసం, యోధ స్ఫూర్తి కారణంగా అమరుడయ్యాడు. కర్ణుని గూర్చి తెలుసుకోవాలి అంటే తప్పక రేపటి మహాభారత హరికథా శ్రవణానికి ప్రతి ఒక్కరూ రావలసిందిగా మనవి. స్వయంగా రాలేని వారు మన గరుడ టీవీ తెలుగు ఛానల్లో, గరుడ టీవీ యూట్యూబ్ లో, గరుడ టీవీ మొబైల్ యాప్ లో లైవ్ ద్వారా ఈ కథనాన్ని, ఈ మహా అద్భుత కావ్యాన్ని వీక్షించవచ్చు. ఆ ద్రౌపతి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా మన అందరి పైన ఉండాలని మనస్పూర్తిగా అమ్మను ప్రార్థిస్తూ..మొగరాల ద్రౌపతి అమ్మ దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు.. శుభం



