సింగం కృష్ణ,భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్,మునుగోడు ప్రతినిధి,సంస్థాన్ నారాయణపురం,పుట్టపాక,మే31,(గరుడ న్యూస్):
కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఆరు గ్యారెంటీలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారదర్శకంగా ఇండ్ల ఎంపిక జరగాలని సంస్ధాన్ నారాయణపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అవ్వారి సుబ్బారావు తెలిపారు.ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లలో అవకాశం కల్పించాలన్నారు.రాజకీయ పార్టీల తోటి సంబంధం లేకుండా ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి సుబ్బారావు విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఇందిరమ్మ కమిటీలను నియమించిన విషయం మనందరికీ తెలిసిందే.ఇందిరమ్మ కమిటీ సభ్యులు గ్రామస్థాయిలో అధికారులతో చర్చించి పారదర్శకంగా రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగాలని వారన్నారు.గ్రామాల్లో ఎవరైతే ఇండ్లు లేని నిరుపేదలున్నారో వారందరికీ ఇండ్లు మంజూరు చేయాలన్నారు.అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వ అధికారులపై విశ్వాసం ఉందని నిజమైన అర్హులకే ఇల్లు మంజూరు అవుతుందనే నమ్మకం ఉన్నదనే విషయాన్ని వారు గుర్తు చేశారు.నిజమైన అర్హులకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తేలేదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎంపిక ప్రక్రియలో అవుకు తవకలు జరగకుండా చూసుకోవాలని వారన్నారు.రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ జరగాలన్నారు.అద్దె ఇళ్లలో,ఇల్లు లేక నిలువ నీడ లేక అవస్థలు పడుతున్న నిజమైన అర్హులకు అన్యాయం జరిగితే ఎంత వరకైనా పోరాటనికి సిద్ధమని వారికి మా పార్టీ పరంగా అండగా ఉంటామని అన్నారు.అధికార పార్టీ నాయకులు పలుకుబడిని ఉపయోగించి ప్రభుత్వం నుంచి గ్రామాలకు మరిన్ని ఇండ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలే తప్ప,గ్రామాల్లో నిజమైన అర్హుల సంఖ్యను క్రమంగా తగ్గించే ప్రయత్నం చేయొద్దనే విషయాన్ని గుర్తు చేశారు.మా పార్టీ,మీ పార్టీ అనే ఆలోచన ధోరణి లేకుండా ఇల్లు ఉన్నదా లేదా అనే విషయాన్ని గుర్తించి సర్వే నిర్వహించి ఎంపిక ప్రక్రియ జరగాలన్నారు.ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరగకుంటే ప్రభుత్వ కార్యాలయాల ముందు నిజమైన అర్హులతో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా గ్రామస్తుల సమక్షంలో గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలన్నారు.గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎంపికైన వారి జాబితాను గ్రామపంచాయతీ కార్యాలయానికి అతికించాలన్నారు.నిజమైన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరయ్యే వరకు మీ పక్షాన తెలుగుదేశంపార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా వారు భరోసా కల్పించారు.




