గరుడ ప్రతినిధి పుంగనూరు

నేటి నుండి మీ ప్రాంతం లో గల ఉండే రేషన్ షాపుల్లో రేషన్ బియ్యం తీసుకోవాలని,మండలం లోని వివిధ పౌరసరఫరా కేంద్రాలను తాహాశిల్దార్ హనుమంతు తమ సిబ్బంది తో కలిసి రేషన్ షాపులను తనిఖీ చేశారు,అందులో భాగంగా ఎవరు కూడా తూకాలలో తేడాలు రాకూడదని, ఎక్కడ కూడా ఉచిత బియ్యం కు డబ్బులు వసూలు చేయకూడదని, అనుమానం వస్తే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తనిఖీలు చేపడతామని,ఎక్కడైనా స్టాక్ తేడాలు ఉంటే చర్యలు తప్పవని రేషన్ డీలర్లను హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహశిల్దార్ నందిని,రెవిన్యు ఇన్స్పెక్టర్ భారతి,గ్రామ రెవిన్యూ అధికారులు, రెవిన్యూ సహాయకులు పాల్గొన్నారు.


