
గరుడ న్యూస్,సాలూరు
పార్వతీపురం మన్యం జిల్లా,సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం శంబర గ్రామములో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దేవతగా వెలుగొందుతున్న శ్రీశ్రీశ్రీ శంబర పోలమాంబ అమ్మవారి దేవస్థానం చదురుగుడి, వనం గుడి యొక్క ఆలయ హుండీలను అనగా తేదీ 30-5-2025 శుక్రవారం దేవాదాయశాఖ పార్వతిపురం మన్యం జిల్లా ఉన్నతాధికారులు, కార్యనిర్వహణ అధికారి, గ్రామ పెద్దలు రివున్నాయులు, పోలీస్ సిబ్బంది సేవకులు సిబ్బంది సమక్షంలో హుండీలను తెరిచి లెక్కించడమైనది. ఈ లెక్కింపులో చదురు గుడి హుండీల ద్వారా రూ,,2,34,399/-, వనం గుడి హుండీల ద్వారా రూ,,1,65,219/- వెరసి రెండు ఆలయంలకు కలిపి 3,99,618/- ఆదాయం వచ్చినది. ( ఈ ఆదాయం తే 28-3-2025 నుండి 30- 5-2025ది) వరకు గల కాలమునకు వచ్చింది. ఈ హుండీలను దేవాదాయ శాఖ పార్వతీపురం మన్యంజిల్లా ఉన్నతాధికారులు ఆదేశముల మేరకు సాలూరు గ్రూపు దేవాలయముల కార్యనిర్వాహణ అధికారి టి. రమేష్ పర్యవేక్షకులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ వి. వి. సూర్యనారాయణ, తీళ్ల పోలి నాయుడు ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్ వెదుళ్ళ సింహాచలమమ్మ , నైదాన తిరుపతిరావు మాజీ ఉత్సవ కమిటీ చైర్మన్, రివున్నాయులు అక్యాన నర్సింగరావు, గ్రామ పెద్దలు , మక్కవ ఏఎస్ఐ , పోలీస్ సిబ్బంది ఏపీజీవీ బ్యాంక్ ఉద్యోగులు, సేవకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

