
పండగ మూడు రోజులు శ్రీ ఇప్పల పోలమ్మ తల్లి, శ్రీ ఎర్ర కంచమ్మ తల్లి దర్శనంకి వచ్చిన భక్తులకు పార్వతీపురం పట్టణ పోలీసు వారి ముఖ్య విజ్ఞప్తి గుడి దగ్గరలో చిన్నచిన్న వీధులు అవ్వడం వలన ఎటువంటి వాహనాలు అనుమతించబడవు. గుడికి దూరంలో ఇతర భక్తులకు వెళ్లి రావడానికి ఆటంకం కలిగించకుండా వాహనాలు పార్క్ చేసుకోవలెను.
3 వ తేదీన శ్రీ ఇప్పల పోలమ్మ తల్లి, ఎర్ర కంచమ్మ తల్లి సిరిమాను తిరుగు వీధులలో టౌన్ నాయుడు వీధి, పోలీస్ స్టేషన్ వీధి, దంగిడి వీధి, ఆడబడి వీధి, జగన్నాధపురం, కొత్త వీధి లలో ఉండే ప్రజలకు పార్వతీపురం పట్టణ పోలీసులు తెలియచేయు ముఖ్య విజ్ఞప్తి ఇంటి ముందర ఎటువంటి వాహనాలు పార్కు చేయకూడదు మరియు ఇంటి ముందర సిరిమాను వెళ్లడానికి ఇబ్బంది కలిగే ఎటువంటి వస్తువులు కూడా ఇంటి ముందర ఉంచరాదు. పోలీసులకు సహకరిస్తారని కోరుకుంటున్నాము.
శ్రీ ఇప్పల పోలమ్మ తల్లి, ఎర్ర కంచమ్మ తల్లి సిరిమానోత్సవం 3 వ తేదీన జరుగును. కావున పార్వతీపురం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించబడును.

విజయనగరం నుండి వచ్చిన హెవీ వెహికల్స్ ఆరోజు సాయంత్రం 05.00 గంటల నుండి సిరిమానోత్సవం అయినంత వరకు సుమారు అర్ధరాత్రి 02.00 గంటల వరకు పట్టణంలోకి అనుమతించబడవు. నర్సిపురం దగ్గర హెవీ వెహికల్స్ ఆపబడుతుంది. కార్లు ,ఆటోలు ,మోటార్ సైకిల్స్ మాత్రమే ఆర్టీసీ కాంప్లెక్స్ ఫ్లైఓవర్ మీదుగా పాలకొండ వైపు మరియు రాయగడ వైపు వెళ్లాలి అనుకుంటే ఫ్లైఓవర్ నుండి కొత్తవలస మీదగా చంద్రంపేట నుండి అర్తాం వైపు అనుమతించబడును.
రాయగడ నుండి వచ్చిన హెవీ వెహికల్స్ ఆరోజు సాయంత్రం 05.00 గంటల నుండి సినిమానోత్సవం అయినంత వరకు సుమారు అర్ధరాత్రి 02.00 గంటల వరకు పట్టణంలోకి అనుమతించబడవు. అర్తాం దగ్గర హెవీ వెహికల్స్ ఆపబడు తుంది.కార్లు ,ఆటోలు ,మోటార్ సైకిల్స్ మాత్రమే అర్తాం, చంద్రంపేట, కొత్తవలస మీదుగా పాలకొండ వైపు మరియు బొబ్బిలి వైపు వెళ్లాలి అనుకుంటే ఫ్లైఓవర్ నుండి బైపాస్ రోడ్డు మీదగా RTC కాంప్లెక్స్ వైపుగా అనుమతించబడును.
పాలకొండ నుండి వచ్చిన హెవీ వెహికల్స్ ఆరోజు సాయంత్రం 05.00 గంటల నుండి సినిమానోత్సవం అయినంత వరకు సుమారు అర్ధరాత్రి 02.00 గంటల వరకు పట్టణంలోకి అనుమతించబడవు. జనవరి జంక్షన్ దగ్గర దగ్గర హెవీవెహికల్స్ ఆపబడుతుంది. కార్లు ,ఆటోలు ,మోటార్ సైకిల్స్ మాత్రమే రాయడవైపు వెళ్లాలి అనుకుంటే కొత్తవలస చంద్రంపేట,అర్తాం,మీదుగా రాయగడ వైపు మరియు బొబ్బిలి వైపు వెళ్లాలి అనుకుంటే ఫ్లైఓవర్ నుండి బైపాస్ రోడ్డు మీదగా RTC కాంప్లెక్స్ వైపుగా అనుమతించబడును.
RTC కాంప్లెక్స్ నుండి పార్వతీపురం టౌన్ మెయిన్ రోడ్డు వైపునకు సినిమానోత్సవం అయినంతవరకు ఎటువంటి వాహనాలు లోపలికి అనుమతించబడవు. కావున పార్వతీపురం ప్రజలు మరియు ఇతర ప్రదేశాల నుండి పండగ నిమిత్తం వచ్చిన ప్రజలు పండగ మూడు రోజులు పార్వతీపురం పట్టణ పోలీసులకు పండగ సక్రంగా జరిగే విధంగా సహకరిస్తారని పోలీసులు యొక్క ముఖ్య విజ్ఞప్తి చేశారు.




