
పార్వతీపురం, మే 31, గరుడ న్యూస్ : పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో మలేరియా, డెంగ్యూ కేసులు లేకుండా నివారణకు చర్యలు చేపట్టాలని ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం తన ఛాంబరులో వైద్యులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా పీఓ మాట్లాడుతూ ఐటీడిఏ పరిధిలో మలేరియా మరియు డెంగ్యూ కేసులు ఉండరాదని, వాటి నివారణకు పూర్తి చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలలు తెరిచిన వెంటనే విద్యార్థులందరికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఐఎంఆర్, ఎంఎంఆర్ మరణాల రేటుని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పీఓ తేల్చి చెప్పారు. ఈ విషయంలో
వైద్యాధికారులందరు ప్రత్యేక శ్రద్ద చూపాలని స్పష్టం చేశారు
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్. భాస్కరరావు, ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె.వి.ఎస్. పద్మావతి, జిల్లా మలేరియా అధికారి వై.మణి, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డా. ఎం.వినోద్ కుమార్,ఎనిమిది మండలాలకు వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.



