
గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని ఊటూరు బస్టాప్ సమీపంలో మధ్యం విక్రయిస్తున్న మహిళను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం రెడ్డెమ్మ మధ్యం అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో సమాచారం మేరకు దాడి చేసి ఆమె వద్ద నుంచి 25 మధ్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితురాలిని రిమాండ్ నిమిత్తం పుంగనూరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు ఎస్‌ఐ తెలిపారు.