
గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూన్ 01
వైసిపి కేంద్రీయ కార్యాలయం పిలుపుమేరకు రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 4న పుంగనూరులో నిర్వహించే వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేద్దామని మండల వైసిపి అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి జడ్పిటిసి ఎన్ దామోదర్ రాజులు పిలుపునిచ్చారు ఆదివారం ఈ మేరకు స్థానికంగా మండల స్థాయి వైసిపి నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు సంవత్సర కాల వ్యవధిలో తొలిసారి జరిగే వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మండలంలోని 19 పంచాయతీల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా నాయకులు చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం దినోత్సవం విజయవంతం కోసం పంచాయతీల వారీగా చర్చించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాజుల రామ్మూర్తి మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాజీ సింగిల్ విండో చైర్మన్ రవిచంద్ర రెడ్డి సర్పంచులు ఓబుల్ రెడ్డి షంషీర్ భాగ్యలత హరినాథ్ నాయకులు రవి ఎంపీటీసీ సభ్యుడు శ్రీరాములు మండలంలోని వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

