గరుడ న్యూస్,సాలూరు
సాలూరు లో 15 ఏళ్ల తరువాత జరిగిన గ్రామదేవత శ్రీ శ్యామలాంబ పండుగకు 18 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారని,ఈ జాతర లో తమ సేవలు అందించిన వారిని ముఖ్యంగా సాలూరు మున్సిపాలిటీ వారికి,శానిటరీ సిబ్బందికి,పోలీసులకి,మీడియాకి దుస్సాలువ తో సన్మానం సన్మానం చేసి మగవారికి ప్యాంట్,షర్ట్ క్లాత్,ఆడవారికి చీర అందించారు.విద్యుత్ శాఖ వలన కొన్ని వార్డుల ప్రజలు ఇబ్బంది పడిన సంగతి వాస్తవమే అన్నారు.విద్యుత్ సిబ్బందికి కూడా సత్కారం జరిగింది.ఈ కార్యక్రమం లో టిడిపి నాయకులు,ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.తదుపరి విందు భోజనం ఏర్పాటు చేశారు.




