గరుడ ప్రతినిధి పుంగనూరు

పుంగనూరు పట్టణం కోనేటి వద్ద వెలసియుండు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో సోమవారం విశేష పూజలు జరిగాయి. ఉదయాన్నే లింగానికి రుద్రాభిషేకాలు, ఫల పంచామృతాభిషేకాలు, అలంకరణ, బిల్వార్చనలు అర్చకులు సుబ్బయ్య దీక్షితులు నిర్వహించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కలిపించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.


