గరుడ ప్రతినిధి
చౌడేపల్లి జూన్ 02
నియోజకవర్గం కేంద్రం పుంగనూరులో ఈనెల 4న వైకాపా ఆధ్వర్యంలో తలపెట్టిన వెన్నుపోటు దినం పోస్టర్లను సోమవారం చౌడేపల్లిలో ఆవిష్కరించారు మండల వైసీపీ అధ్యక్షుడు నాగభూషణ రెడ్డి ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల పైన అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని అలాంటి చర్యలకు పాల్పడరాదని అన్నారు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించిందని అన్నారు అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి దామోదర్ రాజు ఎంపీపీ గాజుల రామ్మూర్తి మండల ఉపాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు రవిచంద్ర రెడ్డి చిత్తూరు రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాల వైకాపా అధ్యక్షుడు మిద్దింటి కిషోర్ కాటిపేరు రాజా సంగారెడ్డి కృష్ణారెడ్డి వెంకటరమణ బాబు షంషీర్, శంకరప్ప వెంకటరమణ అల్తాఫ్ ఓబులేసు సుబ్రమణ్యం వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు



