
గరుడ ప్రతినిధి పుంగనూరు

బస్టాండ్ ప్రాంతంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం, ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యం తో ఆగిన ప్రమాదం.వివరాలు ఇలా ఉన్నాయి పుంగనూరు నుండి ఏ.పి.యస్.ఆర్టి.సి బస్సు ప్రయాణికులతో తిరుపతి కి వెళ్తుంది.బస్సు చౌడేపల్లి స్టేజి లోకి రాగానే పలమనేరు వైపు నుండి పొడుగాటి వెదురు బొంగు లతో వస్తున్న బోలెరో వాహనం పైన కట్టిన వెదురు బొంగురు అమాంతం రెండు మూడు బస్సు కిటికీ లోనికి చోచ్చుకొని వెళ్ళాయి.ఐతే ఆ సమయం లో బస్సు వెనుక సీటులో గల ప్రయాణికులు అప్రమత్తం అయ్యారు,అలాగే ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తం అయ్యారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగలేదు.ఐతే పొడుగాటి వెదురు బొంగులను సదరు బొలెరో వాహనదారుడు ఎక్కడి నుండి తీసుకునివస్తున్నారో తెలియదు గాని బస్టాండ్ ప్రాంతం లో అరగంట ట్రాఫిక్ స్తంభించిపోయింది.