
గరుడ ప్రతి నిధి
చౌడేపల్లి జూన్ 04
వేరుశనగ విత్తనాలు ఈనెల 6 నుంచి పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారిని జ్యోతమ్మ తెలిపారు స్థానిక కార్యాలయంలో మాట్లాడుతూ మండలంలోని అన్ని రైతు సేవ కేంద్రాల నందు వేరుసెనగ కాయలు కావాల్సిన రైతులు వారి పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు 5న గడ్డంవారిపల్లి 6న దుర్గ సముద్రం చారాల ఏ కొత్తకోట కాగతి కాటి పేరి లధిగం పందిళ్ళపల్లి 8న చౌడేపల్లి పరికిదొన 9న కొండా మరి వెంగళపల్లి 10న చింతమాకులపల్లి దిగువపల్లి రైతు సేవ కేంద్రాల నందు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నారు మండలానికి 1059 క్వింటాళ్లు వేరుసెనగ విత్తనాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు 30 కిలోల బస్తా 40% సబ్సిడీ పోను రూ 1674లు రైతులు చెల్లించాల్సి ఉంటుందన్నారు పంట సాగు చేసే రైతులు మాత్రమే విత్తనకాయలు తీసుకోవాలని కావాల్సిన రైతులు పట్టాదారు పాసుపుస్తకం ఆధార్ కార్డు వారి ఫోన్ రైతుసేవ కేంద్రాలకు తీసుకుని నమోదు చేయించుకోవాలని ఆమె కోరారు
