
మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారద్యంలో పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో వెన్నుపోటు దినం భారీ నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహణ
పార్వతీపురం అర్బన్: వైసిపి అధినేత వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపుమేరకు పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన నేడు వేలాది మంది వైసిపి శ్రేణులు, ప్రజల సమక్షంలో కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పాలనకు నిరసనగా వెన్నుపోటు దినం భారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిరసన కార్యక్రమంలో భాగంగా వైయస్ఆర్ విగ్రహం వద్ద నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ సంఖ్యలో ప్రజలతో కలిసి సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని కోరుతూ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలనకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోభిక కు మాజీ ఎమ్మెల్యే జోగారావు చేతుల మీదుగా ప్రజా ప్రతినిదులు, నాయకులు సమక్షలో వినతి పత్రం సమర్పించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు జరిగేలా చొరవ తీసుకుని ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరడం జరిగినది.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జోగారావు కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా సాగించిన అసమర్థ పాలనను ఎండగడుతూ వేలాది మంది ప్రజల పక్షాన నిల్చుని హామీలు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నీ డిమాండ్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇంకా ఆయన మాట్లాడుతూ…
• గత అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన టీడీపీ కూటమి, అధికారంలోకి వచ్చిన తర్వాత, అన్నింటినీ మర్చిపోయింది, ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా, ఎన్నికల్లో ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ సిక్స్’ హామీలతో పాటు 143 వాగ్దానాల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు అన్నారు. అలా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో అన్ని రంగాలు నిర్వీర్యమయ్యాయి అన్నారు.
• దీంతో పిల్లలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు.. ప్రతి ఒక్కరూ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
అన్ని రంగాలు తిరోగమనం.
స్కూళ్లు, ఆస్పత్రులు అన్నీ నాశనం అయ్యాయి, మరోవైపు తొలి ఏడాదిలోనే ఏకంగా రూ.15 వేల కోట్ల కరెంటు బిల్లుల షాక్. ఒక్కటంటే ఒక్క పథకం అమలు చేయకపోయినా ఏడాది కాలంలో దాదాపు రూ.1.50 లక్షల కోట్ల అప్పు.
• మరోవైపు యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేయడంతో, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అని మహిళలు, బాలికలు, దళితులకు రక్షణ కరువైంది. ఇదీ టీడీపీ కూటమి ప్రభుత్వ నిర్వాకం అన్నారు.
• వీటన్నింటిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేలా, కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’ నిర్వహిస్తున్నాం అని అందులో భాగంగా రాష్ట్రమంతా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించి, ఎక్కడికక్కడ ఉన్నతాధికారులకు ఇలా వినతి పత్రాలు అందజేయడం జరిగింది అని మన పార్వతీపురం లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగినది అని తెలిపారు. ఇంకా ఏ ఏ హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం
• రైతు భరోసా:
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలు కాకుండా, తాము రూ.20 వేలు ఇస్తూ, మొత్తం రూ.26 వేల పెట్టుబడి సాయం చేస్తామని తొలుత ప్రకటించారు. ఆ తర్వాత మాట మార్చి, కేంద్రం ఇచ్చే దాంతో కలిపి ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం చేస్తామని వెల్లడించారు.
అయితే వరసగా రెండో ఏడాది ఖరీఫ్ సీజన్ దాదాపు ప్రారంభం అవుతున్నా, ఇస్తానన్న రైతు భరోసా రూ.20 వేల ఊసే లేదు. గత ఏడాది కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఇప్పటికీ అందలేదు. అలా ప్రతి రైతుకు రూ.40 వేల బాకీ.
ఈ రెండో ఏడాది ప్రతి రైతుకు మరో రూ.20 వేలు కలుపుకుంటే.. మొత్తంగా ఈ రెండో ఏడాది కూడా గడిస్తే..రూ.40 వేలు ప్రతి రైతుకు ఈ ప్రభుత్వం ఎగనామం పెట్టింది. బాకీ పడింది. బకాయిల సహా ఈమొత్తం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
• అమ్మ ఒడి:
ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎగనామం పెట్టారు. రెండేళ్లకు ప్రతి పిల్లాడికి రూ.30 వేలు బాకీ పడ్డారు.
వెంటనే అమ్మకు వందనం పథకాన్ని అమలు చేయాలని, గతేడాది బకాయిలతో కలిపి ప్రతి పిల్లాడికీ ఈ ఏడాది రూ.30వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు.
• ఆడబిడ్డ నిధి:
18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 అంటే సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తామన్నారు. దాన్ని ప్రతి ఇంటికీ ప్రచారం చేస్తూ ఆడ బిడ్డ నిధి అని దీనికి ఒక బ్రహ్మాండమైన పేరు పెట్టారు.
అంటే ప్రతి మహిళకూ టీడీపీ కూటమి ప్రభుత్వం పడిన బకాయి ఏకంగా రూ.36 వేలు. వీటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు
• ఉచిత బస్సు:
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. తొలి ఏడాది ఎగ్గొట్టారు. వెంటనే ఈ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
• నిరుద్యోగ భృతి:
నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తామన్నారు.
కానీ, ఇవ్వకుండా తొలి ఏడాది రూ.36 వేలు ఎగ్గొట్టారు. రెండో ఏడాది కూడా కేటాయింపు లేదు. అంటే అది మరో రూ.36 వేలు. అలా రెండేళ్లకు కలిపి ప్రతి నిరుద్యోగికి కూటమి ప్రభుత్వం రూ.72 వేలు బాకీ. వీటిని కూడా చెల్లించాలి అన్నారు.
• దీపం. గ్యాస్ సిలిండర్లు:
దీపం పథకంలో ప్రతి కుటుంబానికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఈ పథకాన్ని వెంటనే సంతృప్త స్థాయిలో అమలు చేయాలని, మూడు గ్యాస్ సిలెండర్ల డబ్బులను నేరుగా లబ్ధిదారులైన మహిళల ఖాతాలో వేస్తారని డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు.
• యాభై ఏళ్లకే పెన్షన్:
50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామన్నారు. అలా ఏడాదికి రూ.48 వేలు. రెండేళ్లలో రూ.96 వేలు బాకీ. దీన్ని కూడా వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేశారు.
• విద్యాదీవెన. వసతి దీవెన:
పెద్ద చదువులు చదువుతున్న పిల్లాడికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా విద్యాదీవెన కింద, ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్ల చొప్పున ఏటా రూ.2,800 కోట్లు. అలాగే లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఖర్చులకు గానూ వసతి దీవెన కింద గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏటా ఏప్రిల్‌లో రూ.1,100 కోట్లు ఇచ్చేవాళ్లం. అలా ఈ రెండింటికీ ఏడాదికి రూ. 3,900 కోట్లు ఖర్చు చేయాలి.
కాగా, రెండు పథకాలకు సంబంధించి గత ఏడాది రూ.3,200 కోట్ల బకాయిలు పెట్టగా, ఈ ఏడాది అమలు చేయాలంటే మరో రూ.3,900 కోట్లు కావాలి. రెండూ కలిపితే పిల్లలకు రూ. 7,100 కోట్లు కావాలి. కానీ, ఈ ఏడాది బడ్జెట్లో విద్యాదీవెన కింద చూపిన మొత్తం రూ.2,600 కోట్లు మాత్రమే. వెంటనే ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు విడుదలచేయాలని డిమాండ్ చేసారు.
• ఆరోగ్యశ్రీ. ఆరోగ్య ఆసరా:
ఆరోగ్యశ్రీ పథకంలో నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించడం లేదు. నెలకు రూ.300 కోట్ల చొప్పున గత ఏడాది రూ.3,600 కోట్లు బకాయి పడ్డారు. బిల్లులు ఇవ్వకపోవడంతో ఆస్పత్రులు వైద్యానికి నిరాకరిస్తున్నాయి.
ఇక శస్త్ర చికిత్స తర్వాత రోగికి విశ్రాంతి సమయంలో, వైద్యులు సూచించినంత కాలం చేసే ఆర్థిక సాయం ‘ఆరోగ్య ఆసరా’ ఊసే ఈ కూటమి ప్రభుత్వం ఎత్తడం లేదు. వీటిని కూడా వెంటనే చెల్లించాలి అని ప్రజల పక్షాన డిమాండ్ చేశారు
• పెన్షన్లు:
ఇక పెన్షన్ల విషయానికి వస్తే.. గత ఏడాది ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి ఏకంగా 66,34,372 పెన్షన్లు ఇస్తూ ఉంటే.. కూటమి ప్రభుత్వంలో అవి 62,95,565 లక్షలకు పడిపోయాయి. ఈ నెల పంపిణీ చేసింది కేవలం 61.48 లక్షలు మాత్రమే. దాదాపుగా 4 లక్షల పెన్షన్లు తగ్గాయి. వెంటనే పెన్షన్ల కోతను విరమించుకోవాలని డిమాండ్ చేస్తు వెనువెంటనే కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయాలని కోరుతున్నాం అన్నారు.
ఇలా సూపర్ సిక్స్.. సూపర్ సెవన్‌లు పక్కన పెడితే.. మిగిలిన 143 హామీల పరిస్థితి దారుణం.వాలంటీర్లకు రూ.10 వేల జీతం కట్. అంత కంటే దారుణం. వారి తొలగింపు. పెళ్లి కానుక రూ.లక్ష కట్. పెట్రోల్ డీజిల్ ధర తగ్గింపు లేదు.
చంద్రన్న బీమా. సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవవాత్తూ మరణిస్తే రూ.10 లక్షలు అన్నారు. వాటినీ ఇవ్వడం లేదు అని దుయ్యబట్టారు.
డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నారు. ఇదీ ఒట్టి మాటే అయింది. మరోవైపు సున్నా వడ్డీ రుణాలు కూడా శూన్యం.
ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు.. హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి లారీ, టిప్పర్ డ్రైవర్‌కు ఏటా రూ.15 వేలు అన్నారు. ఇది గత ప్రభుత్వంలో అమలు చేసిన వాహనమిత్ర పథకం. ఇదీ గాలికి పోయింది.
ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నారు. ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇవ్వలేదు అన్నారు.
• కూటమి ప్రభుత్వ. అనైతిక పర్వం:
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక, హత్యలు 390 హత్యలు, హత్యా యత్నాలు, దాడులకు గురైన వైయస్సార్ సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైయస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన వైయస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు 500 మంది. అక్రమ కేసులు నమోదైన సోషల్ మీడియా యాక్టివిస్టులు 440 మంది
కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులు 79 మంది.,
దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది., జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. జైళ్లకు వెళ్లిన జర్నలిస్టులు 8 మంది. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198. ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. జైలుకు వెళ్లిన ప్రజా సంఘాల నాయకులు ఇద్దరు.
అధికారులకు వేధింపులు:
టీడీపీ కూటమి పాలనలో వేధింపులకు గురైన అధికారులు 199 మంది. వారిలో ఏఎస్పీలు 27, డీఎస్పీలు 42, సీఐలు 119 మంది.
ఐపీఎస్‌లు డీజీ ర్యాంక్ అధికారి. పీఎస్‌ఆర్ అంజనేయులుపై అక్రమ కేసు పెట్టారు. మరో డీజీ ర్యాంక్ దళిత అధికారి సునీల్‌కుమార్ సస్పెండ్ చేశారు అన్నారు. అడిషనల్ డీజీ ర్యాంకు అధికారి సంజయ్ సీనియర్ ఐపీఎస్ ఐజీ ర్యాంక్ అధికారి కాంతిలాల్ రాణా, ఐజీ ర్యాంక్ ఆఫీసర్ విశాల్ గున్నీ, ఐజీ ర్యాంకు అధికారి రఘురామిరెడ్డి., ఇంకా ఐపీఎస్ అధికారులు రవిశంకర్ రెడ్డి, నిశాంత్‌రెడ్డి, పి.జాషువా కూడా వేధింపులకు గురయ్యారు అన్నారు. అలానే
మరో రిటైర్డ్ అధికారి విజయ్‌పాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. ఇలాంటి కక్షసాధింపు చర్యలను విరమించుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాం అని మాజీ ఎమ్మెల్యే జోగారావు సభా ముఖమగా తెలిపారు.
• సంక్షేమం లేదు.
అభివృద్ధి అంత కంటే లేదు. పథకాల అమలు లేదు. ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడం లేదు. కాబట్టి, కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేసేలా అధికారులు చొరవ చూపాలని ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేస్తు కూటమి ప్రభుత్వం నీ ప్రజల పక్షాన నిలదీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలాలు, పట్టణ పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిదులు మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, జిల్లా పార్టీ ప్రతినిదులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్ సభ్యులు, నియోజకవర్గ మరియు రాష్ట్ర వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, కార్యదర్శులు, సీనియర్ నాయకులు, మండలాలు, పట్టణ పార్టీ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




