గరుడ న్యూస్,సాలూరు
బుదవారం విజయనగరం సీతం కాలేజి లో మాజీ డిప్యూటీ సీఎం పిడిక రాజన్న దొర లా సెట్ పరీక్ష కు హాజరయ్యారు.గతం లో ఎం. ఏ పీజీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం సాధించారు.కొన్నాళ్ళ తరువాత రాజకీయాలలో ప్రవేశించాక ఏకధాటిగా 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు.వైసీపీ హయం లో మంత్రిగా,ఉప ముఖ్యమంత్రి గా పదవులు దక్కాయి.2024 లో వైసీపీ ప్రభుత్వం ఓటమి చెందింది.ఇప్పటికీ ఖాళీ సమయం లభించడం తో తనకు ఇష్టమైన లా కోర్సు పూర్తి చేద్దామని మళ్ళీ విద్యార్థిగా మారారు.సంతోష్ పాణిగ్రాహి కి ఎదురుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పూర్తి చేశారు.అలా ఒక మాజీ డిప్యూటీ సీఎం,ఒక సర్టిఫైడ్ జర్నలిస్ట్ మళ్ళీ విద్యార్థులు గా మారి 3 ఏళ్ల లా కోర్సు పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు.





