గరుడ న్యూస్, పాంచాలి
ప్రస్తుతం పర్యావరణంలో అనేక మార్పులు కారణంగా అధిక వర్షాలు లేదా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం భూమి వేడెక్కిపోవడం మంచు పర్వతాలు కరిగిపోవడం వంటివి జరుగుతున్నాయని దీనికి ప్రధాన కారణం గాలి, నీరు, నేల కాలుష్యం కావడమే అని పాంచాలి సర్పంచ్ జి. యుగంధర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక హై స్కూల్ లో వ్యవసాయ అధికారి కొల్లి తిరుపతిరావు హెడ్మాస్టర్ ప్రభాకర్ రావులతో కలిసి హైస్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలన పరిసరాల పరిశుభ్రత సరైన మురుగునీరు సదుపాయాలు కల్పించడంతోపాటు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని పరిరక్షించినప్పుడే కాలుష్య నివారణ సాధ్యపడుతుందని తెలిపారు అనంతరం ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.





