గరుడ ప్రతినిధి పుంగనూరు
పుంగనూరు లో చెరువులకు రక్షణ కల్పించండి అని వరల్డ్ కల్చర్ & ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ మెంబెర్ పి అయూబ్ అలీ ఖాన్ కేంద్ర జలశక్తి అభియాన్ మినిస్ట్రీ అఫ్ కామర్స్ డైరెక్టర్ నిఖిల్ జెఫ్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు శాస్త్రవేత్త డి. అనంత రావు కు ఇమెయిల్ ద్వారా పుంగనూరు లో 90 శాతం చెరువులు కబ్జాకు గురుయ్యయి. నీటి వనరులైన చెరువులు, కుంటలు గేడ్డలు వాగులు, వంకలు తదితరవి దాదాపు కబ్జాకు గురవుతున్నాయి. కళ్ళ ముందే చెరువులు ఆక్రమణకు గురవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయలు విలువైన చెరువులు కనుమరుగవుతున్నాయి. చెరువులు కనుమరుగవటం వలన భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. చెరువులు లేకపోవడంతో సకాలంలో వర్షాలు కురవడం లేదు. భవిష్యత్తులో నీటి సమస్య ఏర్పడి నీటి యుద్ధాలు జరిగే అవకాశం ఉంది. జలచక్రం జరగక ఋతువులు గతి తప్పుతున్నాయి. తక్షణమే చెరువులును పరిరక్షించాలి అని ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది.



