
గరుడ ( న్యూస్ ) కనివిని ఎరుగని రీతిలో, చరిత్రలో లేని విధంగా ఓ కుటుంభాన్ని గ్రామం నుంచి వెలివేసిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు మండలంలోని అమ్మిగానిపల్లెలో ఒక కుటుంభాన్ని ఊరు నుంచి బహిష్కరించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఇటీవల జరిగిన గంగజాతర సందర్భంగా ఒకే వర్గానికి చెందిన రెండు కుటుంభాలు ఘర్షణలు పడినట్లు తెలిపారు. దీంతో ఊరు పెద్దలు గ్రామం నుంచి తమ కుటుంభాన్ని వెలివేస్తూ పంచాయతీలో తీర్మాణించినట్లు తెలిపారు. దీంతో బాధితులకు ఏం చేయాలో అర్థంకానీ స్థితిలో పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరామన్నారు.


